నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి సిబ్బంది కొరత

by Kalyani |
నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి  సిబ్బంది కొరత
X

దిశ, హిమాయత్ నగర్ : నారాయణగూడ పోలీస్ స్టేషన్ కి సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ పని చేయవలసిన కానిస్టేబుళ్లు 60 మందికి 35 మందే ఉన్నారు. దీంతో కేసుల దర్యాప్తులో జాప్యం నెలకొంటోంది. నగరంలోని బిజీ పోలీస్ స్టేషన్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడున్నా నలుగురు ఎస్సైలు బదిలీలపై వేర్వేరు పోలీస్ స్టేషన్స్ కి వెళ్లిపోయారు. ఈ మధ్యలోనే ఒక ఎస్సై ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్), ఇద్దరు ఎస్సైలు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు డిటెక్టివ్ ఎస్సై ఈయన నేర పరిశోధనలో బిజీగా ఉంటే శాంతిభద్రతలకు ఒక్క ఎస్సై మాత్రమే ఉన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో సీపీఐ రాష్ట్ర కార్యాలయం, టూరిజం కార్యాలయం, రాష్ట్ర పంచాయతీరాజ్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, సీసీఎస్ (పాత పోలీసు కమిషనరేట్) భవనం వంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలతోపాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ వంటి రాష్ట్ర స్థాయి సంఘాల కార్యాలయాలు, ముఖ్యంగా విద్యాలయాలు ఇక్కడున్నాయి. నిత్యం ఏదో ఒక ధర్నా, బందోబస్తు ఉండనే ఉంటుంది. యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, పరీక్షలకు ఇద్దరు ఎస్సైలతోనే ముగించారు. ఎస్ హెచ్ఓ కూడా ఎస్సైలతో పాటు కష్టపడాల్సి వచ్చింది. ఇలాంటి ముఖ్యమైన పోలీస్ స్టేషన్ పై ఉన్నతాధికారులు దృష్టిని సారించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed