Hyderabad:సీరియల్ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్

by Jakkula Mamatha |   ( Updated:2025-01-02 13:31:48.0  )
Hyderabad:సీరియల్ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: బుల్లితెర నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేస్తోన్న యువకుడిని హైదరాబాద్‌(Hyderabad)లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ(29) యూసుఫ్‌గూడ(Yusufguda)లో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్‌లో చేస్తున్న సమయంలో ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని రెండు నెలల క్రితం చెప్పాడు. ఆమె మాత్రం తనకు పెళ్లి అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి పెళ్లికి నిరాకరించింది.

ఆ రోజు నుంచి నిందితుడు ఆమెను పెళ్లి పేరుతో వేధించినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు అసభ్యకర సందేశాలు, వీడియోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి అత్త ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడకు వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. దీంతో ఆమె అతని వేధింపులు భరించలేక జూబ్లిహిల్స్ పోలీసుల(Jubilee Hills Police)కు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలియడంతో అతను ఆమెకు ఓ సెల్ఫీ వీడియోను పంపించి.. తన వల్లే ఇదంతా జరిగిందని అందులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed