యూపీలో కోర్టు విచారణకు హాజరైన అసదుద్దీన్ ఒవైసీ

by Y. Venkata Narasimha Reddy |
యూపీలో కోర్టు విచారణకు హాజరైన అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ యూపీలో కోర్టు విచారణకు హాజరయ్యారు. 2022 ఫిబ్రవరి 3న యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై హాపూర్ కోర్టులో జరిగిన విచారణకు అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. అసదుద్దీన్ ఒవైసీ కోర్టుకు హాజరైన సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు పూర్వపరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేందుకని ఢిల్లీకి బయల్దేరిన ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపారు.

మీరట్‌కి సమీపంలోని కితౌర్‌లో ప్రచారం ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి వెళ్తుండగా చాజౌరీ టోల్ గేట్ వద్ద అసదుద్దీన్ ఒవైసి ప్రయాణిస్తున్న కారుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. దుండగులు తన కారుపై మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులకు పాల్పడినట్టు అసదుద్దీన్ ఒవైసీ అప్పట్లో మీడియాకు వెల్లడించారు. కాగా అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ హాపూర్ కోర్టులో కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed