మా నాన్న నన్ను బెల్టు, చెప్పులతో పొట్టు పొట్టు కొట్టేవాడు.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-11-19 04:10:18.0  )
మా నాన్న నన్ను బెల్టు, చెప్పులతో పొట్టు పొట్టు కొట్టేవాడు.. స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సింగర్ కమ్ హీరో అయినటు వంటి బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో వీడియో జాకీగా చేస్తూ ఆ తర్వాత ‘విక్కీ డోనర్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి నేడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయుష్మాన్ ఖురానా బాల్యంలో తనకు జరిగిన చేదు అనుభవాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నా బాల్యం చాలా బాధాకరంగా ఉండేది. నా తండ్రి నియంతలా ఉండేవాడు. నన్ను చెప్పులతో, బెల్టులతో పొట్టు పొట్టు కొట్టేవాడు. ఓ సారి నేను సిగరేట్ తాగకపోయినా నా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టాడు. ఇప్పుడు నేను నా భార్య తహీరా ట్వంటీస్‌లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్‌ను. నేను నా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రష్మిక మందన్న నటిస్తున్న హారర్ కామెడీ సినిమా అయినటువంటి 'థమా'(THAMA) సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

Advertisement

Next Story