Pushpa 2: పాట్నా ఈవెంట్‌కు మించి బెంగుళూరులో పుష్ప 2 ఈవెంట్‌?

by Prasanna |   ( Updated:2024-11-19 16:00:29.0  )
Pushpa 2: పాట్నా ఈవెంట్‌కు మించి బెంగుళూరులో పుష్ప 2 ఈవెంట్‌?
X

దిశ, వెబ్ డెస్క్ :దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం, పుష్ప తప్ప వేరే సినిమా పేరు వినిపించడం లేదు. బీహార్‌లోని పాట్నాలో పుష్ప-2 ( pushpa 2) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ ను గ్రాండుగా నిర్వహించారు. ఎవరూ ఊహించని విధంగా అభిమానులు రావడంతో చిత్ర యూనిట్ కూడా షాక్ అయ్యారు. ఈ పుష్పరాజు ఎక్కడా తగ్గరని.. అల్లు అర్జున్ ( Allu Arjun ) మాస్ డైలాగ్ చెప్పి అందరికి ఓ ఊపు తెప్పించేశాడు.

బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డబుల్ సక్సెస్ అయింది. ఇంతవరకు ఎవరూ కూడా ఇలాంటి ఈవెంట్ చేయలేదు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు ఇలా ఎన్నో రికార్డులను అల్లు అర్జున్ బ్రేక్ చేశాడు.

నార్త్‌లో ఈవెంట్‌ గ్రాండ్‌ సక్సెస్ అయింది ఇప్పుడు సౌత్‌లో పెద్ద ఈవెంట్‌ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం. నవంబర్ 23న బెంగుళూరులో మరొక ఈవెంట్ చేస్తారట. అయితే, పాట్నా ఈవెంట్‌కు మించి బెంగుళూరులో చేయాలనీ మూవీ యూనిట్, అల్లుఅర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : Pushpa 2: పుష్ప 2 ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన ఆ నటుడు ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed