PM Modi: నా స్నేహితుడు మెక్రాన్ ను కలవడం సంతోంగా ఉంది

by Shamantha N |
PM Modi: నా స్నేహితుడు మెక్రాన్ ను కలవడం సంతోంగా ఉంది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ( Emmanuel Macronని భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) అభినందించారు. ఈ క్రమంలోనే ఆయన పలువురు దేశాధినేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అందులో భాగంగానే, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ( Emmanuel Macron)తో సమావేశమయ్యారు.‘నా స్నేహితుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. భారత్‌, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఎనర్జీ, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించాం. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు కృషి చేస్తాం అని మోడీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో పారిస్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్‌ను ప్రశంసించారు. ఈ సమావేశం భారత్‌- ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ 20 సదస్సులో (G20 Summit) మోడీ పాల్గొన్నారు.

బ్రిటన్ ప్రధానితో భేటీ

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ (Keir Starmer)తోను మోడీ చర్చించారు. ‘భవిష్యత్ కాలంలో సాంకేతికత, గ్రీన్‌ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నాం’ అని మోడీ తెలిపారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కూడా మోడీ భేటీ అయ్యారు. కాకాపోతే, ఇరువురు ఏ అంశంపై చర్చించారో మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌తో సహా పలు దేశాధినేతలతోను మోడీ సమావేశమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed