- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jaishankar: జీ 20 సదస్సులో చైనా- భారత్ విదేశాంగ మంత్రుల భేటీ.. చర్చ దేనిగురించంటే?
దిశ, నేషనల్ బ్యూరో: చైనా- భారత మధ్య ఉద్రిక్తతల వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా కేంద్రమంత్రి జైశంకర్ (Jaishankar) చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి (Wang Yi)తో సమావేశమయ్యారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ విషయంలో కొంత పురోగతి సాధించామని జైశంకర్ అన్నారు. అలానే, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపామని తెలిపారు. ‘‘జీ20 సమ్మిట్‌లో భాగంగా సీపీసీ (CPC) పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యాం. భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ విషయంలో పురోగతి వచ్చింది. ఇతర ప్రపంచ దేశాల పరిస్థితులపై చర్చలు జరిపాము’’ అని సోషల్ మీడియాలో జైశంకర్ పోస్టు చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరుదేశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం తమకు గుర్తుచేసిందని అన్నారు.
బ్రిక్స్ సమావేశంలో..
ఇకపోతే, బ్రిక్స్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. గల్వాన్ లోయలో పెట్రోలింగ్ ప్రారంభమయిన కొన్ని రోజులకే ఆ భేటీ జరిగింది. జీ 20 శిఖరాగ్ర సమావేశానికి ముందు, ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య కుదిరిన ముఖ్యమైన ఉమ్మడి ఒప్పందాలను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా వెల్లడించడం విశేషం. ఇకపోతే, 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దాదాపు, 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కాగా.. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.