- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Health Tips : ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి.. న్యుమోనియాకు దారితీయవచ్చు!
దిశ, ఫీచర్స్ : వింటర్‌లో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో శ్వాసకోశ సమస్యలు ప్రధానంగా ఉంటున్నాయి. పిల్లలు, పెద్దలు కూడా వీటి బారిన పడుతుంటారు. అయితే వారానికి మించి లక్షణాలు కొనసాగితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు అవి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌గా మారి న్యుమోనియా(Pneumonia)కు దారితీయవచ్చునని చెబుతున్నారు. ఇంతకీ దీని లక్షణాలు ఏమిటి? ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు వేరు, ఇవి త్వరగా తగ్గిపోతాయి. కానీ న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరల్ లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైన రూపంగా హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో వాపు వస్తుందని, శ్వాస తీసుకోవడంలో ఆటంకం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాగా న్యుమోనియా ఎక్కువగా 65 ఏండ్లు పైబడిన పెద్దలకు, రెండేండ్ల లోపు చిన్న పిల్లలకు వస్తుంది.
లక్షణాలు
పెద్దలు, పిల్లల్లో వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకి శ్వాసపరమైన ఇబ్బందులకు కారణం అవుతుంటాయి. దీంతోపాటు గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీలో నొప్పిగా అనిపించడం, దగ్గు, జలుబు, ఆకలి లేకపోవడం, శరీరంలో ఏదో గందరగోళంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఫైబ్రోసిస్, ఆస్తమా, అదర్ పల్మనరీ డిసీజెస్ ఉన్నవారికి చలికాలంలో న్యుమోనియా త్వరగా డెవలప్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి లక్షణాలు కనిపించగానే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఏం చేయాలి?
రెండు మూడు రోజులకు మించి శ్వాసలో ఇబ్బంది కొనసాగుతుంటే అది న్యుమోనియాకు దారితీయవచ్చు. కాబట్టి మీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించాలి. డాక్టర్ల సలహా మేరకు లంగ్స్ ఎక్స్ - రే లేదా సిటీ స్కాన్ వంటివి తీయించుకోవాలి. ఇక లక్షణాల తీవ్రతను బట్టి ఏ విధమైన న్యుమోనియా డెవలప్ అయిందో తెలుసుకోవడానికి రక్త పరీక్ష, అలాగే పల్స్ ఆక్సిమెట్రీ ద్వారా ఊపిరి తిత్తుల పనితీరును డాక్టర్లు అంచనా వేస్తారు. పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ అందిస్తారు.
నివారణ ఎలా?
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు చిన్న ఇన్‌ఫెక్షన్లు కూడా లంగ్స్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసి న్యుమోనియాగా డెలప్ కావచ్చు. కాబట్టి శరీరంలో తగిన ఇమ్యూనిటీ పవర్ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం తగిన పోషకాహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి కొనసాగించాలి. దీంతోపాటు ప్రస్తుతం న్యుమోనియా నివారణకు న్యూమోవాక్స్ 23, ప్రివెనార్ 13 వంటి టీకాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వైద్య నిపుణులు సూచిన మేరకు వాటిని తీసుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో న్యుమోనియా లక్షణాలు కనిపించగానే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. టీకాలైనా, మందులైనా, చికిత్స విధానాలైనా డాక్టర్ల సూచన మేరకు ఫాలో అవ్వాలి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.