- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Brahmamudi : హ్యాండ్ బ్యాగ్ కోసం తిరిగి వచ్చిన కావ్య.. రాజ్ దొరిపోతాడా?
దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
కావ్య డిజైన్స్ చూసి.. "ఇది ఇంత బాగా ఎలా గీస్తుంది డిజైన్స్.. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మా వాళ్ళను నమ్ముకుంటే నేను పక్కా ఓడిపోయేవాడ్ని. ఇలాంటి వాటిని దొంగలించడంలో తప్పు లేదు. అయినా వీటిని దొంగతనం చేయాలన్నా నా లాంటి గొప్పోళ్ళు మాత్రమే చేయాలని మనసులో " రాజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హ్యాండ్ బ్యాగ్ కావ్యకు గుర్తొస్తుంది కావ్యకు. ఇక, వెంటనే పక్కనే ఉన్న శ్రుతితో చెప్పి ‘హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయా.. వెళ్లి తెచ్చుకుందాం ’ అంటూ ఇద్దరూ క్యాబిన్ వైపు వెళ్తారు.
కావ్య, శ్రుతి అక్కడకు వస్తున్నారని గమనించి, వెంటనే రాజ్ డిజైన్స్ పక్కకు పెట్టి అక్కడే బల్ల కిందకి దూరిపోతాడు. అప్పుడే కావ్య, శ్రుతి క్యాబిన్‌లోకి వస్తారు. కావ్య హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఉండగా, బయట ఉన్న డిజైన్స్ ను చూస్తుంది. ' ఇక్కడికి ఎవరో వచ్చారు శ్రుతి’ అని కావ్య అంటుంది. రాజ్ షాక్ అవుతాడు. ‘ఎలా చెబుతున్నారు మేడమ్’ అని శ్రుతి అంటుంది. ‘ఇందాక మనం మనం వెళ్లేటప్పుడు అటు తిరిగి ఉన్నాయి.. కానీ, ఇప్పుడు ఇటు వైపుకు ఎలా వచ్చాయని ’ అంటుంది కావ్య.