- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్రమ నిర్మాణాలను అరికట్టేదెవరు..
దిశ, ఉప్పల్ : సాధారణంగా భవన నిర్మాణానికి జీ ప్లస్ టూ అనుమతులు లేదా జీ ప్లస్ ఫైవ్ అనుమతులు జారీ చేస్తారు. రెసిడెన్సియల్ ఏరియా మధ్య భారీ షెడ్లు నిర్మాణం చేసేందుకు మాత్రం ఎటువంటి అనుమతులు జారీ చేయరు. కానీ కాప్రా సర్కిల్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నాచారం డివిజన్ పరిధిలో కార్తికేయనగర్ లో ఓ వ్యక్తి భారీ షెడ్డు నిర్మాణం చేపట్టాడు. అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.
ప్రమాదాలు తప్పవు..
రెసిడెన్షియల్ ఏరియాల మధ్య అక్రమ షెడ్లు, గోదాంలు నిర్మించి వివిధ కార్య కలాపాలకు వినియోగిస్తే సికింద్రాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదం తరహాలో భవిష్యత్తులో అదే తరహా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అనుమతులు తీసుకొని భారీ నిర్మాణాలు చేపట్టిన భవనాల్లోనే సరైన జాగ్రత్తలు పాటించకపోవడం ప్రమాదాలకు దారితీస్తుంది. అలాంటి సందర్భంలో ఇలా అక్రమంగా నిర్మించిన షెడ్ల నిర్మాణాలపై ఏమాత్రం జాగ్రత్తలు తీసుకుంటారో తెలియదు. ఇలాంటి తరుణంలో ఎక్కడికక్కడ షెడ్ల నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉంది.
బలహీనుల పై ప్రతాపం..
చర్యలు తీసుకునే విషయంలో కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారుల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదకరంగా షెడ్ల నిర్మాణాల పై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు పేదలు, బలహీనుల నిర్మాణాల పై ఉక్కు పాదం మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ షెడ్ నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.