- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Inspirational : నీ పట్టుదలకు హ్యాట్సాఫ్.. ట్రాఫిక్‌లో దివ్యాంగ జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: జీవితంలో ఎన్ని సమస్యలు వెంటాడుతున్న వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ముఖ్యంగా దివ్యాంగులకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. వారు వైకల్యానికి తలొగ్గకుండా ముందుకెళ్లి విజయం సాధించిన సంఘటనలు చూసే ఉంటారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని జీవనం సాగిస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగుడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
(Hyderabad) హైదరాబాద్‌లో ఓ దివ్యాంగ జోమాటో డెలివరీ బాయ్ (Zomato delivery boy) తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. ఒక కర్ర సాయంతో నడిచే అతను ఫుడ్ డెలివరీ చేయడం అందరి హృదయాలను కదిలిస్తోంది. సిటీ ట్రాఫిక్‌లో వాహనాన్ని నడపడం చాలా కష్టమైన విషయం.. అలాంటిది ఆ దివ్యాంగుడు కష్టాన్ని ఎదిరించి జీవనం సాగిస్తున్నాడు. విక్రమ్ ముదిరాజ్ అనే నెటిజన్ (X) ఎక్స్ వేదికగా ఈ వీడియో తాజాగా పోస్ట్ చేశారు. ‘కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టంలో నుంచి బయటపడిన వాళ్లే గొప్పవారు. కష్టం నుండే బాధ తెలిసింది. అప్పుడే మనిషికి ఎలాంటి లోపం ఉన్న బతుకు సాగించాలి అంతే. నీ పట్టుదలకు హ్యాట్సాఫ్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.