- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nazriya Nazim: ఆ కారణం వల్లే అతనితో నటించేందుకు నిరాకరించా.. పుష్ప నటుడి సీక్రెట్ బయపెట్టిన నజ్రియా
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నజ్రియా(Nazriya Nazim) పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో ‘రాజా రాణి’(Raja Rani) సినిమాతో అమ్మడు కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాని ‘అంటే సుందరానికి’ లో నటించి మెప్పించింది. ప్రజెంట్ ‘సూక్ష్మ దర్శిని’(Sookshma Darshini) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా తన భర్త ఫహాద్ ఫాజిల్(Fahad Fazil)పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఫహద్ నటించి చిత్రాల్లో ‘ఆర్టిస్ట్’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. 2013లో విడుదలైన ఈ మూవీలో ముందు నాకే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు 12th పరీక్షలు ఉండటం వల్ల నేను అంగీకరించలేకపోయాను. అయితే చిత్రం రిలీజ్ అయ్యాక చూశాను.
అందులో ఫహద్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. 2014లో వచ్చిన ‘బెంగళూరు డేస్’(Bangalore Days) సినిమా కోసం ఫస్ట్ టైమ్ మేమిద్దరం కలిసి వర్క్ చేశాం. ఆ సమయంలోనూ మా మధ్య స్నేహం ఏర్పడటంతో కొంతకాలం డేటింగ్(dating)లో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం. అయితే మేమిద్దరం ఎంతో సరదాగా గడిపేవాళ్ళం. కానీ సెట్‌లోకి అడుగుపెట్టగానే తను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేవాడు. చాలా విచిత్రంగా అనిపించేవాడు.
సెట్‌లో ఉన్నంతవరకే ఆ పాత్రలోనే ఉంటాడు. పాత్ర ఏదైనా సరే ఇంటి వరకూ తీసుకురాడు. కానీ ‘జోజి’లో తన రోల్ తనపై ఎంతో ప్రభావం చూపించింది. షూట్ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలోనే ఉండేవాడు. నేను ఆశ్చర్యపోయాను’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం పుష్ప-2 గురించి మాట్లాడుతూ.. ‘‘పుష్ప లో ఫహద్ యాక్టింగ్ కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘పుష్ప 2’లో ఆయన అసలైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులోనే ఆయన్ని పూర్తిగా చూస్తారు’’ అని చెప్పుకొచ్చింది.