- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమయం ఇవ్వండి.. హాజరవుతా: ఒంగోలు పోలీసులకు ఆర్జీవీ రిక్వెస్ట్...!
దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Directer Ram Gopal Varma) విచారణకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఆయన తరపున ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్(Ongolu Police Station)కు ఒక మెసేజ్ వెళ్లినట్లు తెలుస్తోంది. తాను విచారణకు హాజరవుతానని, కానీ నాలుగు రోజుల సమయం ఇవ్వాలని మెసేజ్‌లో కోరినట్లు సమచాారం. అయితే ఇందుకు పోలీసులు ఒకే చెప్పారా.. లేదా అనేది తెయాల్సి ఉంది.
కాగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో మంగళవారం ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసును క్వాష్ చేయాలన్న ఆర్జీవీ పిటిషన్‌ను కొట్టు వేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు ఏర్పాట్లు చేశారు. అయితే రామ్ గోపాల్ వర్మ హాజరవుతారా?, లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుండగా కొంత సమయం కావాలని ఆర్జీవీ తరపున పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.
సీఎం చంద్రబాబునాయుడు(Cm Chandrababu Naidu)పై సోషల్ మీడియాలో గతంలో రామ్ గోపాల్ వర్మ అనుచిత పోస్టులు పెట్టారని, మద్దిపాడు పోలీస్ స్టేషన్(Maddipadu Police Station)లో టీడీపీ నేతల ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని నోటీసుు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆర్జీవీ స్పందించి మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఒంగోలు పోలీసులు ఏమంటారో...?.