- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR: కాళేశ్వరంపై విచారణ.. ఈ నెలాఖరున కేసీఆర్‌కు పిలుపు
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ చందరఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఇంకొద్ది రోజుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా కమిషన్ విచారించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 21వ తేదీ అంటే గురువారం హైదరాబాద్ చేరుకోనుంది. వచ్చే నెల 5 దాకా ఇక్కడే ఉండనున్న కమిషన్.. మొదట ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు మాజీ సీఎస్‌లు ఎస్కే జోషి, సోమేశ్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్నారావు, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన స్మితా సబర్వాల్, సీఎంవో మాజీ ఓఎస్డీని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్నదవరు?.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం ఎవరిది..? బ్యారేజీల వైఫల్యానికి అసలు కారణం కారణం ఏంటి? రీ ఇంజనీరింగ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తేవడానికి కారణమేంటి? వంటి ప్రశ్నలతో అధికారులను ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత ఈ నెలాఖరున లేదా డిసెంబర్ తొలి వారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. అయితే కేసీఆర్ విచారణకు వెళ్తారా.? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.