ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్.. రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టివేత

by Shiva |
ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్.. రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల లంచాల పర్వం ఆగడం లేదు. లంచం ఇవ్వడం.. తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు (ACB Officials) చెబుతున్నా అటు అధికారులు, ఇటు సామస్య ప్రజలకు వారి మాటలను పట్టించుకోవడం లేదు. అక్రమార్జనకు అలవాటు పడిన అధికారులు వారి తీరు మార్చుకోవడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా, తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రంగంపేట మండల కేంద్రంలో ఓ సర్వేయర్ ఏసీబీ వలకు చిక్కాడు. గ్రామానికి చెందిన రాములు భూమి విషయంలో ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు సర్వేయర్ చిక్కాల ధర్మారావు రూ.75 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాములు లంచం ఇచ్చేందుకు ఒప్పుకుని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఎసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో రంగంలోకి అధికారులు సర్వేయర్ ధర్మారావు రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed