SBI: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త..లోన్ వడ్డీరేట్లు భారీగా తగ్గింపు..!

by Maddikunta Saikiran |
SBI: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త..లోన్ వడ్డీరేట్లు భారీగా తగ్గింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు ప్రతి నెల రుణాలపై(loans), ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposits)పై వడ్డీ రేట్ల(Interest rates)ను సవరిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది.అలాగే ఎంపిక చేసిన టెన్యూర్ లోన్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక మిగతా టెన్యూర్లపై వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయని ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

ఎంసీఎల్ఆర్ అనేది రుణ ఆధారిత వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2016 ఏప్రిల్‌లో ఈ విధానాన్నితీసుకొచ్చింది. ఎంసీఎల్ఆర్ ప్రవేశపెట్టకముందు బేస్‌ రేటు(Base Rate), బెంచ్‌మార్క్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు(BPLR) అమల్లో ఉండేవి. 2016 ఏప్రిల్‌ కు ముందు లోన్లు తీసుకున్నవారికి బేస్‌ రేటు, బీపీఎల్‌ఆర్‌ ఆధారంగానే వడ్డీ రేట్లుంటాయి. ఆ తర్వాత రుణాలు తీసుకున్న వారికి ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేట్లు వర్తిస్తాయి.ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వకూడదు. ఇక ఎస్బీఐ బేస్ రేటు 10.40 శాతంగా ఉంది. అలాగే బీపీఎల్‌ఆర్‌ 15.15 శాతంగా ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed