- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడలతో మంచి భవిష్యత్తు.. ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
ముధోల్, దిశ : క్రీడలతో ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి అన్నారు. ముధోల్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ఎంపీపీ ఆయేషా ఆఫ్రోజ్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడకారులతో ఫుట్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. మానసిక, శారీరక దారుడ్యానికి ఉల్లాసానికి క్రీడలు ప్రధాన భూమిక పోషిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమని అన్నారు.
క్రీడా నైపుణ్యం పెంచేందుకు శిక్షణా శిభిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజేందర్ క్రీడాకారుల కోసం తన వంతు సహాయంగా తయారు చేసిన టీషర్టులను ఎమ్మెల్యే చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. జిల్లా స్థాయి క్రీడాకారుల కోసం తన వంతు సహాయంగా స్పోర్ట్స్ కిట్లను క్రీడాకారులకు అందజేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లపుడు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆఫ్రోజ్ ఖాన్, స్థానిక సర్పంచ్ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు రాం రెడ్డి, కో అప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలీద్, ఎంఈఓ మైసాజి, ఎంపిడిఓ సురేష్ బాబు, ఎస్సై సాయి కిరణ్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.