- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా : కేసీఆర్
దిశ, ఆదిలాబాద్ : రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని, ప్రజలు జాతీయ పార్టీలను విస్మరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో గురువారం డైట్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజల ఆయుధం ఓటు అని, ఓటు వేసే ముందు అభ్యర్థుల వెనుక పార్టీల చరిత్ర కూడా తెలుసుకోవాలన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు ,కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇలాంటి తరుణంలో సంక్షేమం,రైతుల గురించి అలోచించి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు బాగు చేసి సాగుకు నీళ్లు అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఇక్కడ తెలంగాణ గురించి ఆలోచించి ఓటర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ రైతు బంధు పై ఆరోపణలు చేశారని, రైతు బంధు ఉండాలంటే రామన్న గెలువాలని కోరారు. ఇక ప్రస్తుత టీపీసీసీ 24 గంటలు కరెంట్ దండగ అంటున్నారని..మరీ అది ఉండాలి అంటే ఆదిలాబాద్ లో కారుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేరేవాళ్లకు వేస్తే... ఇవన్నీ ఉండవని తెలిపారు. అందరికీ న్యాయం జరుగాలని ధరణి నీ తీసుకు వస్తే..ప్రతి పక్షాలు ఆరోపణలు చేయడం వారి అవినీతి పాలనకు నిదర్శనం అన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చే రాహుల్ గాంధీ కాంగ్రెస్ వస్తే ధరణి ని తీసేస్తాం అంటే ఊరుకునేది లేదన్నారు.ధరణి వల్లే భూములపై యజమానులకు అధికారం వచ్చిందని, రైతుబంధు డబ్బులు అవినీతి లేకుండా నేరుగా వారి అకౌంట్లలో జమ అవుతున్నాయని తెలిపారు. ఏ పైరవీ లేకుండా రైతు బీమా కూడా రైతుల ఖాతాలో పడుతుందని, దీన్ని తీసేసి కాంగ్రెస్ రైతుల మధ్య కొట్లాట పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే టీపీసీసీ 24 గంటలు కరెంట్ అవసరం లేదని, 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పడం రైతులకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు.
మూడు గంటలు కరెంటు ఇస్తే 10 ఎస్పీ మోటార్లు కావాలని.. అవి ఎవరు కొనిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోసమే బతుకుతాడని తెలిపారు. ముస్లిం లను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గ వాడుకున్నదని ఆరోపించిన సీఎం.. ఎన్నో ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ ముస్లింల కోసం 10 వేల కోట్లు ఖర్చు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలోనే ముస్లిం కోసం 12 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ ,బీజేపీలు ఒకటేనని విమర్శించారు.అయితే కేంద్రంలో 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండగా రాష్ట్రానికి 150 మెడికల్ కాలేజీలు అవసరం అని 100 సార్లు లేఖ రాసిన బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీని ఇవ్వలేదన్నారు. నవోదయ విద్యాలయాలు కూడా ఇవ్వని ఈ పార్టీకి, కాంగ్రెస్ లకు ఓటు వేస్తే మనకు అంధకారం తప్పదని హెచ్చరించారు. అన్ని కుల మతాలను కలుపుకొని ముందుకు వెళ్తున్న కారు గుర్తు పార్టీకి ఓటు వేసి ,మత పిచ్చి బీజేపీని బొందలో తొక్కాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.