- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
భగవంతుని నామస్మరణతో మనసు ప్రశాంతత.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, మామడ : భగవంతున్ని నామస్మరణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని న్యూ సాంగ్వి గ్రామంలోని నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయంలో విగ్రహప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఇప్పటివరకు మండలంలో 136 నూతన ఆలయాలను నిర్మించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ప్రతిష్టాపన మహోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీచైర్మన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి, సర్పంచ్ సుజాత శ్రీనివాస్, వైస్ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి , డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎంపీడీవో రమేష్, నాయకులు భూషణ్ రెడ్డి, అశ్విన్, వికాస్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, జగన్మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, గంగారెడ్డి, అశోక్, అలీమ్, సంజీవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.