- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mother love : అమ్మ కౌగిలి.. ఆనంద లోగిలి..
దిశ, ఫీచర్స్ : అమ్మంటే తేనెలోని తీయందనం.. అమ్మంటే వెన్నెలలోని హాయి.. అమ్మంటే మమతల మాధుర్యం.. అమ్మంటే ప్రేమానురాగాల అనుబంధం.. అందుకే పెద్దలు అంటారు, అమ్మలాలనలోని వాత్సల్యం ముందు ఇంకేదీ సాటిరాదని. అమ్మ ఒడికన్నా సురక్షితమైనది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదని. పసిప్రాయంలో ఉన్నప్పుడు, ఏ బూచాడో వచ్చి మనల్ని మింగేస్తాడన్న భయం వేసినప్పుడు అమ్మ ఒడిలో దాక్కుంటాం. అమ్మ కౌగిలిలో సేఫ్‌గా ఫీలవుతాం. ఈ స్పర్శే పిల్లల్లో ఆత్మ విశ్వాసానికి, ఆనందానికి కారణం అవుతుందని, పెద్దయ్యాక కూడా వారిని నడిపిస్తుందని తాజా అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి.
మీ పిల్లలు తెలివైన వారిగా, ధైర్య వంతులుగా తయారు కావాలంటే చిన్నప్పుడు అమ్మ స్పర్శ లేదా కౌగిలి చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల్లో మెదడు డెవలప్ కావాలంటే సెన్సరీ స్టిమ్యులేషన్ చాలా అవసరం. ఇది అమ్మ స్పర్శ లేదా కౌగిలి ద్వారా సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. తల్లి తన బిడ్డను హత్తుకోవడం వెనుక పెద్ద మహత్తు ఉందంటున్నాయి పరిశోధనలు. కనీసం 20 నిమిషాలైనా తన బిడ్డను ఒడిలోకి తీసుకోవడం, హత్తుకోవడం వంటివి తల్లి చేయడంవల్ల పిల్లల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మ ప్రేమగా చేసుకునే ఆలింగనంవల్ల చిన్నారుల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ డెవలప్‌మెంట్‌కు అది సహాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణలో, రోగ నిరోధక శక్తి పెరగడంలో అమ్మ స్పర్శ లేదా కౌగిలింత అద్భుతం చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.