- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Seethakka: అనుమతులు ఇస్తే వారంలోపు పూర్తి చేస్తాం.. కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ
దిశ, వెబ్‌డెస్క్: మహిళా సాధికారత(Women Empowerment)కు పెద్దపీట వేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క(Minister Seethakka) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి ఆదేశాలతో కేంద్ర ఇంధన కార్యదర్శికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా సోలార్ ప్లాంట్లను కేటాయిస్తే భూములను గుర్తించి మహిళా సమాఖ్యలకు లీజుకు ఇస్తామని ఆమె వెల్లడించారు. ఒక్కో మెగా వాట్ ప్లాంట్‌కి రూ. మూడు కోట్ల వరకు వ్యయం అవుతుందని, 10 శాతం మహిళా సంఘాలు భాగస్వామ్యులుగా ఉంటే 90 శాతం బ్యాంకు లోన్లు మంజూరు చేస్తాయన్నారు.
ఇంధన శాఖ అనుమతులు ఇస్తే వారంలోపు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఇన్స్టాలేషన్ పూర్తి చేస్తామన్నారు. ఒక్క మెగా వాట్ ఉత్పత్తి పై ఏడాదికి రూ. 30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీంను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రారంభించిందని తెలియజేశారు. మహిళా సంఘాల కోసం 17 వ్యాపారాలను గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు కుట్టు పని తో పాటు మహిళాశక్తి క్యాంటీన్లు పలు రకాల వ్యాపారాలు ఇందులో ఉన్నాయన్నారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తూ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, త్వరలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కేటాయిస్తామని మంత్రి తెలిపారు.