- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్లూరి జిల్లాలో తనిఖీలు.. 200 కేజీల గంజాయి పట్టివేత
దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లా జి. మాడుగులలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. జీపులో తరలిస్తు్న్న 200 కేజీల గంజాయిని పట్టుకున్నారు. జీపు నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. జీపుతో పాటు గంజాయిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు. ‘గంజాయిని ఎక్కడ నుంచి తెచ్చారు. ఎక్కడికి తరలిస్తు్న్నారు. తరలింపు వెనుక వెనక ఎవరున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు గంజాయి తరలించారు. ఎవరికి విక్రయించారు. గంజాయి దందా వెనుక ఎంత మంది ఉన్నారు.’’ అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. నిందితుడి విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
కాగా రాష్ట్రంలో యదేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతోంది. దీంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టించారు. ఏపీ, ఒడిషా సరిహద్దు నుంచి గంజాయి సరఫరా జరుగుతోందని గుర్తించారు. గంజాయి తరలింపుపై ఉక్కుపాదం మోపారు. వాహన తనిఖీలు ముమ్మురం చేశారు. కానీ ప్రతి రోజు ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతోంది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించలేమా అని ప్రశ్నలు వేసుకుంటున్నారు. గంజాయిని పూర్తిగా నియంత్రించే వరకూ వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు.