- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Railways: రీల్స్ చేసే వారిపై ఎఫ్ఐఆర్!.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: రీల్స్(Reels) చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని రైల్వే బోర్డు(Railway Board) నిర్ణయించింది. ఇకపై రైల్వే ప్రాంగణాల్లో(Railway Premises) రీల్స్ చేసే వారిపై కఠిన చర్యలు(Strict Action) తీసుకోనుంది. సోషల్ మీడియా పిచ్చి(Social Media)లో కొందరు ప్రాణాలను సైతం లెక్క చెయ్యట్లేదు. ఫేమస్ అవ్వడం కోసం ప్రమాదకరమైన ఫీట్లు(Dangerous Feats) చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు భారత రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాలు, కోచ్(Railway Coaches) లలో రీల్స్ లో నటిస్తూ.. రైల్వే ప్రయాణికులకు ఇబ్బంది కలిగేంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అటువంటి వారిని గుర్తించి, ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయాలని అన్ని రైల్వే జోన్ల(Railway Jones)కు సూచించింది. రైల్వే ట్రాకులపై, కదుతున్న రైళ్లలో ప్రమాదకర ఫీట్లు చేస్తూ వీడియోలు తీసే వారిపై కేసులు(Cases) పెట్టాలని రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది.