- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికల చదువుతోనే దేశాభివృద్ధి
దిశ, మర్రిగూడ: బాలికల చదువుతూనే దేశాభివృద్ధి జరుగుతుందని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నవీన్ కుమార్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని నాంపల్లి సర్కిల్ కార్యాలయంలో సీఐ ఏ నవీన్ కుమార్ బెంగళూరు చెందిన చైల్డ్ రైట్ అండ్ యు ( క్రై ),ఎఫర్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో.. పూరి పడాయి దేశ్ కి భళాయి అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతదేశంలో బాలికలు చదువుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సమాజంలో సగం భాగమైన మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు . స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బాలికల చదువుపై ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యం చేయాలని తెలిపారు. ప్రజలు చైతన్యవంతమైనప్పుడే మహిళల పైన దాడులు, చిన్నపిల్లల పైన అఘాయిత్యాలు జరగవనిన్నారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ సబ్ ఇన్స్పెక్టర్ ఎం కృష్ణారెడ్డి మర్రిగూడ నాయబ్ తాసిల్దార్ తారక రామాన్ , రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,మహిళా పిఎస్లు శిరీష గీత, రాజపేట తండా మాజీ సర్పంచ్ సక్కుబాయి విచ్చు నాయక్ , సీనియర్ పాత్రికేయులు మహేశ్వరం సతీష్, ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ , జర్నలిస్టులో గొట్టిముక్కుల ప్రకాష్, పగడాల అంజి ,వనమాల మహేష్, బొమ్మిడి బిక్షం, తదితరులు పాల్గొన్నారు.