Remedies: టాన్సిల్స్‌‌తో సఫర్ అవుతోన్న పిల్లలు.. పరిష్కార మార్గాలు..?

by Anjali |
Remedies: టాన్సిల్స్‌‌తో సఫర్ అవుతోన్న పిల్లలు.. పరిష్కార మార్గాలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు ఇటీవల ఎదుర్కొనే సమస్యల్లో టాన్సిల్స్(tonsils) ఒకటి. పిల్లలు ఎక్కువ సమయం ఆట స్థలం(playground)లో, పాఠశాల(school)లో, సూక్ష్మక్రిములు(germs) ఎక్కువగా వృద్ధి చెందే వాతావరణంలో గడుపుతుంటారు. ఈ కారణంగా పిల్లలు టాన్సిల్స్ తో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లల రోగనిరోధక వ్యవస్థ(immune system)ను తగ్గించి.. ఇన్ఫెక్షన్‌(infection)కు దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారి కొంతమంది పిల్లలకు సర్జరీ(Surgery) చేసి తీసేయడం కూడా జరిగింది.

వాస్తవానికి టాన్సిల్స్ ఓ రకంగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఫుడ్‌లో ఉండే బ్యాక్టీరియా(Bacteria) వంటి పలు రకాల క్రిములను ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయట. మరీ ఈ టాన్సిల్ ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి కారణమేంటంటే..? శరీరంలో బాగా వేడి చేస్తే, అలాగే వేడి చేసిన పదార్థాలు తినడం వల్ల వస్తాయి. అలాగే ఫ్రిడ్జ్‌(fridge)లో వాటర్ తీసుకోవడం(బాగా కూల్ ఉన్న నీళ్లు), అధిక కూల్ డ్రింక్స్(More cool drinks), పచ్చళ్లు(Chutneys), మసాలాలు(Spices) బాగా తినడం వల్ల పిల్లల్లో టాన్సిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కాగా ఆహారపు అలవాట్లలో పలు ఛేంజెస్ చేసుకుంటే ఈ టాన్సిల్స్ పిల్లల్ని పెద్దగ ఇబ్బంది కలిగించవని అంటున్నారు. పిల్లలు ఈ పెయిన్‌తో సఫర్ అవుతుంటే వాటర్ వేడి చేసి.. అందులో సాల్ట్(Salt) వేసుకుని పుక్కిలించితే చాలు. ఈ విధంగా రోజుకు రెండ్రోజులు.. రోజుకు నాలుగు సార్లు చేయండి. దాదాపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే నార్మల్ సమయంలో గోరువెచ్చని వాటర్ తాగండి. అలాగే గొంతులో నొప్పి, కఫం(Phlegm) తగ్గుముఖం పట్టాలంటే కరక్కాయ పొడి, తేనె కలుపుకుని రోజులో రెండుసార్లు చప్పరించండని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అలాగే పిల్లలు టాన్సిల్స్ బయటపడాలంటే మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే 30 నిమిషాల ముందు పసుపు(Turmeric), షుగర్(sugar), మిరియాలు(pepper), ఖర్జూరా(dates)లను పొడగా చేసుకుని పాలల్లో వేసి.. మరిగించి తాగండి. కానీ టాన్సిల్స్ నొప్పి ఎక్కువైతే మాత్రం ఆసుపత్రికెళ్లి డాక్టర్‌ను సంప్రదించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed