Constable Suicide: డిపార్ట్‌మెంట్‌లో వరుస విషాదాలు.. మరో కానిస్టేబుల్ సూసైడ్

by Gantepaka Srikanth |
Constable Suicide: డిపార్ట్‌మెంట్‌లో వరుస విషాదాలు.. మరో కానిస్టేబుల్ సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పోలీస్ డిపార్ట్‌మెంట్‌(Police Department)లో వరుస విషాదాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్లు బలవన్మరణం చెందడం హాట్‌టాపిక్‌గా మారింది. మెదక్ జిల్లా కొల్చారం మండల పోలీస్ స్టేషన్‌లోని క్వార్టర్స్‌లో చెట్టుకు ఉరి వేసుకుని సాయికుమార్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, సిద్ధిపేటలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులకు విషమిచ్చి.. ఆ తర్వాత బాలకృష్ణ ఉరి వేసుకున్నారు. ఇక్కడ బాలకృష్ణ మృతిచెందగా.. భార్య, పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఆత్మహత్యల ఘటనలు డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed