ట్రెండ్ సెట్ట‌ర్ ‘దిశ‌’ : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే

by Aamani |
ట్రెండ్ సెట్ట‌ర్ ‘దిశ‌’ : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : తెలుగు జ‌ర్న‌లిజంలో ‘దిశ‌’దిన‌ప‌త్రిక ట్రెండ్ సెట్ట‌ర్‌గా మారింద‌ని వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగ‌రాజు అన్నారు. ఖ‌చ్చిత‌త్వంతో కూడిన వాయు వేగంతో వార్త‌ల‌ను పాఠ‌కుల‌ను అందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. నిజాల‌ను నిర్భ‌యంగా జ‌నాల్లోకి తీసుకెళ్తోంద‌ని, ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా నిలుస్తోంద‌ని కొనియాడారు. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ల‌క్ష‌లాది మంది పాఠ‌కుల ఆద‌ర‌ణ‌ను సంపాదించుకుంద‌ని అన్నారు. నూత‌న సంవ‌త్స‌రం దిశ‌ క్యాలెండ‌ర్‌ను ఆదివారం హన్మ‌కొండ సుబేదారిలోని ఆయ‌న ఇంటివ‌ద్ద ఆవిష్క‌రించారు.

ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌స్తున్న దిశ ప‌త్రికా యాజ‌మాన్యాన్ని అభినందించారు. ఎప్ప‌టిక‌ప్పుడు డైన‌మిక్ ఎడిష‌న్ల ద్వారా తాజా స‌మాచారం అందించ‌డం ద్వారా పాఠ‌కులను దిశ సంపాదించుకుంటోంద‌ని అన్నారు. క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో వ‌రంగ‌ల్ బ్యూరో చీఫ్ అరెల్లి కిర‌ణ్‌గౌడ్‌, హ‌న్మ‌కొండ ఆర్‌సీ ఇన్చార్జి ఉమ్మాల సందీప్‌, కాంగ్రెస్ నేత‌లు సోమ‌శేఖ‌ర శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed