భర్త వేధింపులు తాళలేక భార్య బలవన్మరణం

by Aamani |
భర్త వేధింపులు తాళలేక భార్య బలవన్మరణం
X

దిశ, గోదావరిఖని: ప్రేమించి ..అనుమానించటం తో పాటు అదనంగారూ. 5 లక్షలు కావాలని భర్త వేధించటం తో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.ఈ ఘటన శనివారం తెల్లవారుజామున ఖని బాపూజీ నగర్ లో జరిగింది. గోదావరిఖని వన్ టౌన్ ఎస్ ఐ ఎల్.భూమేష్ సంఘటన వివరాలు వివరించారు. బాపూజీ నగర్ కు చెందిన కాకనాడ కుమారస్వామి గత నాలుగు నెలల క్రితం అదే కాలనీ కి చెందిన మాడుగుల లలిత (18) ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన నాటి నుంచి ఎలాంటి పని చేయకుండా, నిత్యం మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతూ పలు కేసుల్లో జైల్ కి వెళ్లి వచ్చాడని తెలిపారు.

అయితే నిత్యం భార్య మమత ను కుమారస్వామి మెట్టెలు, పుస్తెలతాడు తో పాటు అదనంగా రూ.5 లక్షలు కట్నం కావాలని వేధించేవాడని, దీంతో మమత శ్రీరాంపూర్ లో నివాసం ఉండే తన తల్లి తండ్రులైన మాడుగుల మీన రావు, శారద వద్దకు ఈ నెల 26 నా వెళ్లగా వాళ్ళు సర్ది చెప్పి పంపించారు. శుక్రవారం మళ్లీ గొడవ జరిగిందని, ఉన్నవారు కిటికీ లోంచి చూడగా మమత ఉరివేసుకొని కనిపించిందన్నారు. స్థానికంగా ఉన్నవారు గమనించక అప్పటికే నైలాన్ తాడుతో మమత పై కప్పుకు ఉరివేసుకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు. శారీరక ,మానసిక వేధింపుల తో మమత మృతికి కారణమైన కుమారస్వామి పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మృతురాలి తల్లి మాడుగుల శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

Advertisement

Next Story

Most Viewed