- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలో విద్యను అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాల,రాంనగర్ ఉన్నత పాఠశాల,ప్రైమరీ స్కూల్,బేసిక్ ప్రాక్టీస్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. డిజిటల్ కంటెంట్ ద్వారా తరగతులు విద్యార్థులకు బోధించడం వల్ల ఎక్కువ శాతం విద్యార్థులకు మేలు జరుగుతుందని సూచించారు. రాంనగర్ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్టిమేట్ చేయాలని,మాడల్ బేసిక్ ఉన్నత పాఠశాల లో డైనింగ్ హాల్ లో ఫ్లోరింగ్,కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బేసిక్ ప్రాక్టీస్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా,వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పదవ తరగతి గదిలో డిజిటల్ బోర్డు వినియోగం,కంటెంట్ విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,ఏయంఓ దుంకుడు శ్రీనివాస్,హెఎం టి.విజయ్ కుమార్,అంజలీదేవి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.