వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనూ, పార్టీలోనూ స్పందన లేదు: మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
వైసీపీ ధర్నాలకు ప్రజల్లోనూ, పార్టీలోనూ స్పందన లేదు: మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ ప్రతినిధి,కడప: వైఎస్ జగన్ అవినీతి వల్లే విద్యుత్ భారాలు ₹1,29,000 కోట్లు పెరిగాయని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కరెంట్ చార్జీలు పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంత వరకు విద్యుత్ చార్జీలను పెంచలేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల కారణంగా విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. 22.5 మిలియన్ యూనిట్ల కొరత ఉన్న రాష్ట్రాన్ని 2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది వైసీపీ ప్రభుత్వానికి నాటి టీడీపీ ప్రభుత్వం అప్పగించిందన్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలపై రూ.35 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపడమే కాకుండా రూ.1.20 లక్షల కోట్ల నష్టాన్ని విద్యుత్ శాఖలో తెచ్చి పెట్టారన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా డిస్కంల ద్వారా ప్రజలపై భారం వేయండని ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపారన్నారు. సాధారణంగా ఈఆర్సీకి పంపిన 90 రోజుల్లోపు ట్రూప్ అప్ చార్జీలు ఆమోదం పొందాలన్నారు. కానీ 2024 మే వరకు కూడా ట్రూప్ అప్ చార్జీలను వాయిదా వేస్తూ వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈఆర్సీ నుంచి ఆమోదం పొందిన ట్రూప్ అప్ చార్జీలు నేడు ప్రజల పై భారంగా పడుతున్నాయని వివరించారు. ప్రతి ఏటా విద్యుత్ వినియోగం సగటున 6 శాతం పెరుగుతుందని, పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్టుగా ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుందని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వీటీపీఎస్, కృష్ణపట్నం జెన్కో ప్లాంట్ల సామర్థ్యాన్ని విస్తరించామన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వాటిని పూర్తి చేయలేక పోయారన్నారు

Advertisement

Next Story

Most Viewed