- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి
దిశ సూర్యాపేట కలెక్టరేట్ : వీడియో కాన్పిరెన్స్ ద్వారా రోడ్ల భద్రతపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. గత నెలలో జరిగిన సమావేశంలో జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆర్ డి ఓ సూర్యాపేట వేణుమాధవ్ మాట్లాడుతూ..పిల్లలమర్రి నుండి ఈనాడు ఆఫీస్ వరకు బ్లాక్ స్పాట్స్ గుర్తించటం జరిగిందని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే 22 లొకేషన్స్ లో సైన్ బోర్డ్ లు, డంబెల్ స్ట్రిక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ.. 4 లొకేషన్స్ లలో మాత్రమే ఏర్పాటు చేసారని మిగిలిన లొకేషన్స్ లలో త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మం బైపాస్ సర్వీస్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్,ర్యాంప్ లు ఏర్పాటు చేయాలని ఖమ్మం జాతీయ రహదారి అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం నుండి సూర్యాపేట NH 365 బిబి అన్ని భద్రత చర్యలు ఒక నెల రోజులలో పూర్తి చేస్తామని డి ఈ రాహుల్ తెలిపారు. అన్ని జాతీయ రహదారులపై తీసుకున్న భద్రత చర్యలకి సంబంధించిన వివరాలను సమర్పించాలని సూచించారు. జనగాం క్రాస్ రోడ్డు లో జరుగుతున్న పనుల వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్శన్ చేయాలని సూచించారు. కోదాడ జాతీయ రహదారి NH 67 వద్ద గల అప్రోచ్ రోడ్డు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకి సూచించారు. కోదాడ -మిర్యాలగూడ రోడ్డు లో గోవిందాపురం వద్ద బోర్డులు, లైటింగ్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న అంతర్గత రోడ్ల మరమ్మతుల పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ ల పరిధిలో గల రోడ్ల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చేపట్టిన పనులపై నివేదిక అందజేయాలని కలెక్టర్ ఈ ఈ ఆర్ & బి సీతరామయ్యకు సూచించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస రాజు,R&B ,NHI,NH అధికారులు పాల్గొన్నారు.
Read More..