TDP: భార్యను అడ్డంపెట్టుకుని నాని రాజకీయాలు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్‌

by Ramesh Goud |   ( Updated:28 Dec 2024 2:39 PM  )
TDP: భార్యను అడ్డంపెట్టుకుని నాని రాజకీయాలు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్‌
X

దిశ, వెబ్ డెస్క్: భార్యను అడ్డంపెట్టుకుని పేర్ని నాని(Perni Nani) రాజకీయాలు(Politics) చేస్తున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravidhra) అన్నారు. పీడీఎస్ బియ్యం(PDS Rice) అక్రమ రవాణా(Trnsportation)పై తన మీద వస్తున్న ఆరోపణలకు మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంపై(NDA Govt) సంచలన విమర్శలు చేశారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రవీంద్ర.. ఆయనపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేర్ని నాని తన కుటుంబసభ్యులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి ధోరణి మంచిది కాదని తెలిపారు. అలాగే ఆగ, మగ ఏంటని, తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటేనని మండిపడ్డారు. దొంగతనం చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అంతేగాక తప్పు చేయకపోతే నెల రోజులుగా ఎందుకు పారిపోయారో చెప్పాలని, తప్పు చేయనప్పుడు హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story