Turmeric Powder: ఈ 5 రకాల కూరల్లో పసుపు వేయకూడదు.. ఎందుకంటే..?

by Anjali |   ( Updated:2024-12-28 15:05:08.0  )
Turmeric Powder: ఈ 5 రకాల కూరల్లో పసుపు వేయకూడదు.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: పసుపు ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో పసుపు సహాయపడుతుంది. జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మ వ్యాధులను తగ్గించడంతో పాటు.. మచ్చలు, ముడతలను తగ్గించడంలో తోడ్పడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అల్జీమర్స్ వంటి వ్యాధులను తరిమికొడుతోంది. వంటకాల్లో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. టేస్ట్‌తో పాటు కలర్‌ను ఇస్తుంది. అయితే కొన్ని రకాల వంటకాల్లో పసుపు వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలియక అన్ని వంటకాల్లో పసుపు వేసి వంట చేస్తుంటారు. మరీ ఏఏ కూరల్లో పసుపు వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

మెంతికూర..

మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొద్దిగా మెంతి ఆకులు చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. అయితే ఈ కూర వండినప్పుడు పసుపు వేయకపోవడం మంచిదట. ఎందుకంటే పసుపు టేస్ట్ కూడా కాస్త చేదుగా ఉంటుంది. మెంతి కూడా చేదుగా ఉండడం వల్ల టేస్ట్ తగ్గిపోతుంది.

ఆవాలు ఆకులు..

కొన్ని ప్రాంతాల్లో ఆవాలు ఆకులను బాగా తింటుంటారు. మొక్కజొన్న రొట్టె చేసినప్పుడు ఆవపిండి ఆకుకూర వండి.. దీంతో తింటే హెల్త్ కు మేలు. కానీ ఈ కూరలో పసుపు వేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఆవాకుల్లో ఆస్ట్రిజెంట్.. పసుపులో ఆస్ట్రింజెన్సీ ఉంటుంది. కాగా రుచి మారిపోతుంది.

పాలకూర..

చలికాలంలో జనాలు పాలకూర అధికంగా తీసుకుంటారు. పాలకూర రుచిలో, హెల్త్ బెనిఫిట్స్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పాలకూర వండినప్పుడు పసుపు వేయకూడదు. రుచి మారిపోవడంతో పాటు బ్లాక్ కలర్ గా మారుతుంది.

ఉల్లి కాడల కూర..

ఉల్లికాడల్ని కొంతమంది కర్రీ చేసుకుంటారు. దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ పిలుస్తారు. ఈ కూరలో పసుపు జోడించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడల కర్రీలో పసుపు వేస్తే రుచి పూర్తిగా చెడిపోతుంది.

వంకాయ కూర..

వంకాయ కర్రీ చాలా మంది ఫేవరెట్. ఈ కర్రీ వండేటప్పుడు గరం మసాలా, కారం, ధనియాల పొడి వంటివి వేసి మసాలా వంకాయ కర్రీ తయారు చేస్తారు. కాగా రంగుకు ఏం ఢోకా ఉండదు. పసుపు వేయకపోవడమే మంచిది. ఒకవేళ వేస్తే చెదు ఫ్లేవర్ వస్తుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed