- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ వేలంలోకి 574 మంది ప్లేయర్లు.. రూ. 2 కోట్ల ధరతో ఎంత మంది పాల్గొంటున్నారో తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలంలో పాల్గొనేందుకు 1,574 మంది ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆక్షన్‌లో పాల్గొనే ప్లేయర్ల జాబితాను బీసీసీఐ శుక్రవారం రిలీజ్ చేసింది. 574 మంది ఆటగాళ్లు వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 366 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 208 మంది విదేశీ ప్లేయర్లు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 204 బెర్త్‌లు కోసం 574 మంది పోటీపడనున్నారు. అందులో 70 బెర్త్‌లు ఓవర్సీస్ ప్లేయర్లకు కేటాయించారు.81 మంది రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ కేటగిరీలో పాల్గొంటారు.అందులో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజువేంద్ర చాహల్‌తోపాటు పలువురు భారత స్టార్లు వేలంలోకి రానున్నారు. రూ.1.5 కోట్ల కనీస ధరతో 27 మంది, 18 మంది(రూ.1.25 కోట్లు), 23 మంది(రూ. కోటి), 92 మంది(రూ.75 లక్షలు), 8 మంది(రూ. 50 లక్షలు), 5 మంది(రూ. 40 లక్షలు) షార్ట్ లిస్ట్ అవ్వగా.. రూ. 30 లక్షల బ్రేస్ ప్రైజ్ విభాగంలో 320 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. పంజాబ్ కింగ్స్ రూ.110.5 కోట్లతో అత్యధిక పర్స్ వాల్యూ కలిగి ఉన్నది.