Alekhya Reddy: షాకింగ్ లుక్‌తో దర్శనమిచ్చిన తారకరత్న భార్య.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-11-15 13:42:56.0  )
Alekhya Reddy: షాకింగ్ లుక్‌తో దర్శనమిచ్చిన తారకరత్న భార్య.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: నందమూరి తారకరత్న(Tarakaratna) సడెన్‌గా యువగళం పాదయాత్రలో గుండెపోటుతో మరణించారు. ఆయనను బెంగళూరు(Bangalore) ఆసుపత్రికి తరలించినప్పటికీ 2023 ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఇక అప్పటి నుంచి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన భర్తను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పలు పోస్టులు షేర్ చేస్తుంటుంది. కుటుంబ బాధ్యతలు, ఇతర పనులతో బిజీ అవుతున్న అలేఖ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

కొద్ది రోజుల క్రితం తన పెద్ద కూతురు నిష్క(Nishka) సారీ ఫంక్షన్‌ను అంగరంగ వైభవంగా జరిపించింది. ఈ వీడియోలను నెట్టింట షేర్ చేయడంతో అంతా గ్రేట్ అని అలేఖ్యపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అలేఖ్య తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో బ్లూ జీన్స్ ధరించిన ఆమె స్టైలిష్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు నిష్కకు అక్కలా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story