T Congress: ఢిల్లీకి చేరిన పాలకుర్తి కాంగ్రెస్ అత్తా కోడళ్ల పంచాయితీ

by Prasad Jukanti |
T Congress: ఢిల్లీకి చేరిన పాలకుర్తి కాంగ్రెస్ అత్తా కోడళ్ల పంచాయితీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమె అత్త జాన్సీ రెడ్డి వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అత్తా కోడళ్ల పంచాయితీ తాజాగా ఢిల్లీకి చేరింది. ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి స్థానంలో జాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ కేడర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాజాగా అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. జాన్సీరెడ్డి పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తోంది అంటూ పాలకుర్తికి చెందిన ఉపేందర్ సింగ్ అనే వ్యక్తి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అత్తాకోడళ్ల నిర్లక్ష్యం, అహంకారం కారణంగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి, డబ్బున్న వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

వీరివల్ల పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల నమ్మకం పోతున్నదని ఆరోపించారు. తప్పులను ఎత్తి చూపే జర్నలిస్టులను జాన్సీరెడ్డి టార్గెట్ చేస్తున్నారని, కాంగ్రెస్ లాయలిస్టులను తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్ మెంట్లలో ఆమె తలదూరుస్తున్నారని పేర్కొన్నారు. పాలకుర్తి కాంగ్రెస్ లో పరిస్థితి క్రిటికల్ గా మారిందని తక్షణమే అధిష్టానం జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీలో కొత్త కమిటీలు వేసి పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని విజ్ఞప్తి చేశారు. అత్తా కోడళ్ల వ్యవహారంలో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలువనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed