Good news: ఇన్‌స్టాగ్రామ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్లు

by Anjali |
Good news: ఇన్‌స్టాగ్రామ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోయింది. జనాలు తరచూ ఫేస్ బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), వాట్సాప్ (WhatsApp), ట్విట్టర్ (Twitter) అంటూ అందులోనే మునిగితేలుతున్నారు. పక్క మనుషులతో సంబంధం లేకుండా జీవించేస్తున్నారు.

స్మార్ట్ మొబైల్‌కు ఇచ్చినంత వాల్యూ కనీసం తిండి, నిద్రకు కూడా ఇవ్వట్లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదనుకోండి. చివరకు చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. పిల్లలు ఏడిస్తే.. ఫుడ్ తినకపోయినా చాలు.. పిల్లల చేతికి మొబైల్ ఇచ్చి కార్టూన్ వంటి బొమ్మలేవైనా పెడితే ఏం చక్కా పేరెంట్స్ చెప్పిన మాటలు వింటున్నారు.

ముఖ్యంగా యువత అయితే సోషల్ మీడియా వేదిక అయిన ఇన్‌స్టాగ్రామ్‌కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. రీల్స్ చేస్తూ చాలా మంది ఫేమస్ అవుతున్నారు. గ్రామాల్లోని పలువురు కూడా మంచి మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారీ వ్యూస్ సొంతం చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్ ప్రియుల కోసం కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉంటాయన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ చూసేటప్పుడు సాధారణంగా కొంతమంది వీడియోను ఫార్వర్డ్ చేస్తుండటం చూస్తూనే ఉంటాం. కానీ ఇది కాస్త కష్టంగా భావిస్తారు కొంతమంది. ఇప్పుడు ఆ బాధేమి లేదు.

కొత్త ద్వారా వీడియోకు లెఫ్ట్ అండ్ రైట్ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక వీడియో 2 ఇంటు స్వీడ్‌లో ఫార్వర్డ్ అవుతుంది. అంతేకాకుండా మధ్యలో ప్రెస్ చేసినా వీడియో పాజ్ అవుతుంది. అలాగే వాట్సాప్ ‌లో లొకేషన్‌ను ఏ విధంగా ఇతరులకు పంపిస్తామో.. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసెంజర్‌లో లొకేషన్ పంపించే కొత్త ఫీచర్ వచ్చింది.

Next Story