మంత్రి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. అందరికీ ఆహ్వానం

by Gantepaka Srikanth |
మంత్రి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. అందరికీ ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్(Ramadan Festival) ఒకటి. ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. ప్రభుత్వాలు సైతం అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ముస్లిలకు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శనివారం(29-03-2025) రోజున సాయంత్రం 05:30 నిమిషాలకు మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆధ్వర్యంలో వరంగల్ ఎల్బీనగర్‌లోని A1 క్లాసిక్ కన్వెన్షన్ హాల్‌లో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లింసోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విందుని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్‌(Ramadan Festival) మాసం దాతృత్వం గొప్పతనాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. మనకి ఉన్నదానిని మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని ఈ మాసం తెలియజేస్తుందని చెప్పారు. దైవంపై నమ్మకం కలిగించే గొప్ప గ్రంథమే ఖురాన్‌ అని, మనకు జీవితాన్ని ఇచ్చిన భగవంతుడిని నిత్యం అయిదు సార్లు గుర్తు చేసుకోవం మంచి తరుణమన్నారు. రంజాన్‌ మాసం ఇచ్చే గొప్ప పిలుపు దాతృత్వమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి నాంది పలికిందన్నారు.




Next Story

Most Viewed