- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదివాసీల ఆరాధ్యదైవం భగవాన్ బిర్సా ముండా : ఎంపీ
దిశ, ములుగు ప్రతినిధి: ఆదివాసీల ఆరాధ్యదైవం భగవాన్ బిర్సా ముండా అని, గిరిజనుల సంక్షేమం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహా వ్యక్తి అని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. శుక్రవారం ములుగు మండలంలోని జాకారం గ్రామంలో గల వైటీసీ కేంద్రంలో జన్ జాతీయ గౌరవ్ దివస్ దినోత్సవం, బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ, శరత్, అదనపు కార్యదర్శి జ్ఞానేష్ భారతి, జిల్లా కలెక్టర్ దివాకర,ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్ర, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, డైరెక్టర్ భాస్కర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి ఆదివాసీల ఆరాధ్యదైవం భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ… భూమి, నీటి కోసం పోరాటం చేయడమే కాకుండా భూమి శిస్తు ను వ్యతిరేకిస్తూ గిరిజన జాతి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేశారని, ఆయన పోరాట స్ఫూర్తి ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువ దినోత్సవం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమ కోసం రూ. 78 వేల 600 కోట్ల నిధులను కేటాయించిందని, ఆ నిధులతో గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. 1875 నవంబర్ 15వ తేదీన జన్మించిన బిర్సా ముండా చిన్నతనంలోనే బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించారని, గిరిజనులలో మన సంస్కృతి మన విధానం అనే నినాదాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 360 కోట్లు కేటాయించిందని అన్నారు.
గిరిజనుల సంక్షేమ కోసం హక్కుల సాధన కోసం పోరాటాలు చేసే గొప్ప వ్యక్తులు నేటికీ ఉన్నారని అన్నారు. ములుగు లో ఏర్పాటు చేసిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు 80 శాతం సీట్లు కేటాయించాలని ఎంపీ బలరాం నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేటి తరం యువత స్వాతంత్ర సమరయోధుల కలలను నెరవేర్చాలని, కేంద్ర ప్రభుత్వం జాతీయ దివాస్ దినోత్సవం ములుగు జిల్లాలో నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ… గిరిజనుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలోని 12 కోట్ల జనాభా కలిగిన ఆదివాసి గిరిజనుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, పట్టణాలకు ఆమడ దూరంలో ఉన్న గిరిజన గ్రామాలలో సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నారని అన్నారు.
జాతీయ ఎస్టీ కమిషన్ చేపడుతున్న పనులను గిరిజనులు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ జాతీయ కార్యాలయం ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో ఉన్న ఆదివాసి తెగలు గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని బిర్సా ముండా జయంతి సందర్భంగా ఉత్సవాలు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎస్టీ కమిషన్ పై ఇప్పటివరకు గిరిజనులకు సరైన అవగాహన లేదని స్థానిక అధికారులు యువకులు, గిరిజనులకు జాతీయ ఎస్టీ కమిషన్ ప్రయోజనాలు గిరిజనులకు ఎలాంటి న్యాయాలు చేకూరుస్తుంది అనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గిరిజనులకు పరిపాలనలో, వారి హక్కులను పొందడంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తినా వెంటనే ఎస్టీ కమిషన్ ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
అనంతరం ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ మాట్లాడుతూ… 20 సంవత్సరాలు గల గిరిజన యువకుడు ప్రపంచాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడని , గిరిజనుల జీవన విధానం సంస్కృతి హక్కులు పరిరక్షణ కోసం ఎంతగానో పోరాటం చేశారని, ప్రత్యేకంగా స్వాతంత్ర పోరాటంలో గిరిజనుల పోరాటాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు. గిరిజన గ్రామాలు ఎవరి ఆధీనంలో బందీగా ఉండలేవని మా గ్రామాలు మా హక్కులు స్వతంత్రంగానే ఉంటాయని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గ్రామాలకు స్వతంత్రాన్ని ప్రకటించుకొని పాలించిన మహానుభావుడని కొనియాడారు. గతంతో పోలిస్తే గిరిజన ప్రాంతాలు గిరిజనుల జీవన ప్రమాణాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి మరింత అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు పథకాలు విది విధానాలు తీసుకురావాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
పూర్వకాలంలో గిరిజనులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని బ్రిటిష్ ప్రభుత్వంలో దాదాపు 200కు పైగా తెగలు క్రిమినల్స్ గా చిత్రీకరింపబడి వారి సొంత ప్రాంతంలో నివసించలేక అనేక ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని అలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన నాయకుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ పేసా గ్రామపంచాయతీలుగా ఎన్నికైన అక్కినపల్లి మల్లారం, పసర, రాయినిగూడెం గ్రామలకు అవార్డులు అందజేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సీడ్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి గిరిజన ప్రజలు పాల్గొన్నారు. గిరిజనులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సి హెచ్ మహేందర్ జి, ఆర్డీఓ వెంకటేష్, డి డి పోచం, పెస కోఆర్డినేటర్ ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, విద్యార్థి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.