Exports: అక్టోబర్‌లో 9 శాతం పెరిగిన రత్నాభరణాల ఎగుమతులు

by S Gopi |   ( Updated:2024-11-15 14:42:22.0  )
Exports: అక్టోబర్‌లో 9 శాతం పెరిగిన రత్నాభరణాల ఎగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మన దేశం నుంచి రత్నాభరణాల ఎగుమతులు అక్టోబర్ నెలలో 9.18 శాతం పుంజూకునాయి. కట్ అండ్ పాలిష్డ్ డైమండ్‌కు గిరాకీ అత్యధికంగా ఉండటంతో గత నెల రత్నాభరణాల ఎగుమతుల విలువ రూ. 25,194.41 కోట్లుగా ఉన్నాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో రూ. 22,857.16 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. కట్ అండ్ పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 11.32 శాతం పెరిగి రూ. 11,795.83 కోట్లకు చేరుకున్నాయి. 9 శాతానికి పైగా రత్నాభరణాల ఎగుమతులు నమోదవడం పరిశ్రమకు ఉపశమనాన్ని కలిగించింది. ముఖ్యంగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్లకు డిమాండ్ పెరగడం కలిసొచ్చింది. విదేశాల్లో హాలిడే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నామని జీజేఈపీసీ ఛైర్మన్ విపుల్ షా చెప్పారు. జీజేఈపీసీ డేటా ప్రకారం, సమీక్షించిన నెలలో బంగారు ఆభరణాల ఎగుమతులు 8.8 శాతం పెరిగి రూ. 9,449.37 కోట్లకు పెరిగాయి.

Advertisement

Next Story