Beauty tips : ముఖ వర్ఛస్సును పెంచే ఇంటి చిట్కాలు.. చలికాలంలో పాటిస్తే అందమే అందం!!

by Javid Pasha |
Beauty tips : ముఖ వర్ఛస్సును పెంచే ఇంటి చిట్కాలు.. చలికాలంలో పాటిస్తే అందమే అందం!!
X

దిశ, ఫీచర్స్ : తాము అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అందుకే ముఖంపై నల్లటి మచ్చలు కనిపించినా, పింపుల్స్ పెరిగినా ఆందోళన చెందుతుంటారు. పైగా ఇది కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తుంది కూడాను. అందుకే అమ్మాయిలు రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లు ట్రై చేస్తుంటారు. దీంతో ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటి అవసరం లేకుండా అందాన్ని పెంచే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

* దాల్చిన చెక్కపొడి, తేనె : దాల్చిన చెక్క పొడి గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ ఇంటిలో సాధారణంగానే ఉంటుంది. అయితే ఇందులో తేనె కలిపి ముఖానికి రాస్తే ముఖ వర్ఛస్సు పెరుగుతుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని ఫ్రీ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. పాడైన చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లతో చర్మం ఎర్రబారడాన్ని, స్కిన్ ఇరిటేషన్‌ను, వాపును, నొప్పిని తగ్గిస్తాయి. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఇందుకు సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్ రెడ్‌నెస్, స్కిన్ ఇరిటేషన్, వాపు వంటి సమస్యలకు చెక్ పెట్టి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

*పెరుగు, ఓట్స్, బంగాళ దుపం : కూడా ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ పెరుగును ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ ఓట్స్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దీనిని ముఖం మీద రాస్తూ మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండుమూడుసార్లు ఇలా చేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కూడా స్కిన్‌ను ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. బంగాళ దుంప రసం కూడా ముఖ వర్ఛస్సును పెంచుతుంది. ఓ కాటన్ బాల్‌తో మచ్చలు ఉన్నచోట బంగాళ దుంప రసాన్ని అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. దీంతో నల్లమచ్చలు పోతాయి.

*పాలు, పసుపు : ఒక టీ స్పూన్ పసుపు పొడిని, కొద్దిపాటి పాలలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై మచ్చలు, మెటిమలు ఉన్నచోట రాసి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. డే బై డే ఇలా చేస్తుంటే మచ్చలు మాయం అవుతాయి. పాలు, పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా ఉండచంలో సహాయపడతాయి. దీంతో ముఖ వర్ఛస్సు పెరుగుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed