Telangana Tourism: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-15 14:36:04.0  )
Telangana Tourism: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పర్యాటక రంగం(Telangana Tourism)లో తెలంగాణలోని ప్రజాప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కీలక ప్రకటన చేశారు. శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వ‌హించిన ట్రవెర్నియా ఫెస్ట్‌(Travernia Fest)కు చీఫ్‌ గెస్ట్‌గా మంత్రి జూప‌ల్లి హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సార‌ధ్యంలో కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వ ప‌ర్యాట‌క రంగానికి పెద్ద‌పీట వేసింద‌న్నారు. ప‌ర్యాట‌కుల‌తో పాటు జాతీయ‌, అంత‌ర్జాతీయ స‌ద‌స్సులు, స‌మావేశాలు, అధికారిక‌ కార్య‌క్రమాలు, ఆయా ప‌నుల నిమిత్తం తెలంగాణ‌కు వ‌చ్చే వారిని ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు తీసుకువెళ్లేందుకు అనేక ప‌థ‌కాలు చేప‌డుతున్నామ‌ని చెప్పారు.

వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ.. తెలంగాణ టూరిజం ప్ర‌మోష‌న్ కోసం కృషి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. తెలంగాణ ప‌ర్యాట‌క(Telangana Tourism) ప్రాంతాల‌ను సంద‌ర్శించి, టూరిజం ప్ర‌మోష‌న్ కు అంబాసిడ‌ర్లుగా నిల‌వాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. త్వరలోనే టూరిజం ప్రమోషన్ కోసం నూతన కమిటీ వేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్య‌క్ర‌మంలో యూఎన్ టూరిజం అంబాసిడ‌ర్ కార్ల్ జోషువా, ప్ర‌ముఖ చరిత్ర‌కారుడు డా. సిన్హారాజా త‌మ్మిట‌, ట్ర‌వేర్నియా ఫెస్ట్ వ్య‌వ‌స్తాప‌కులు డా.అంతొని విపిన్ దాస్, ర‌వాణా ప‌రిశ్ర‌మ, ట్రావెల్ ఎజెన్సీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story