భైంసాలో బ్యాంక్ లాకర్లు హౌస్ ఫుల్.. కారణం ఏంటంటే..

by Sumithra |
భైంసాలో బ్యాంక్ లాకర్లు హౌస్ ఫుల్.. కారణం ఏంటంటే..
X

దిశ, ముధోల్ : నిన్న మొన్నటి వరకు ఖాళీగా ఉన్న భైంసా పట్టణంలోని బ్యాంకు లాకర్లన్నీ ఒక్క సారిగా బిజీ అయ్యాయి. కొంత మంది బ్యాంకు ఖాతాదారులకు లాకర్ దొరికి సంతోషంతో ఉంటే, కొంత మంది ఖాతాదారులు మాత్రం లాకర్ దొరక్క బాధపడుతున్నారు. అసలు ఒక్కసారిగా లాకర్లకు ఇంత డిమాండ్ రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కొంత మంది దొంగలు గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలో సంచరిస్తున్నారని, వారు ఏకంగా ఇండ్లలోకి చొరపడ్డారని వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. దీంతో ప్రజలంతా తమ ఆభరణాలను దాచుకోవడానికి బ్యాంకులకు చేరి లాకర్స్ తీసుకోవడం ప్రారంభించారు. ఖాతాదారులందరూ ఒక్కసారిగా లాకర్లు తీసుకోవడంతో అన్ని బ్యాంకుల లాకర్లు హౌస్ ఫుల్ అయ్యాయి. అయినప్పటికీ కొంత మంది భైంసాలో ఉన్న బ్యాంకులన్నింటికి లాకర్ల కోసం తిరుగుతున్నారు. స్టమర్స్ కి లాకర్స్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story