- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : ఎమ్మెల్యే
దిశ, జన్నారం : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పోరేట్ స్థాయిలో విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో మనఊరు మనబడి పథకానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ అన్నారు. మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని చింతలపల్లె ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన నూతన గదులను గురువారం ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఊరు-మన బడి ఒక అద్భుత పథకం అని అన్నారు. దీనిద్వారా పాఠశాలలు బాగుపడం, పేదింటి బిడ్డ నాణ్యమైన విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో అన్నివిధాలా వసతులు కల్పించేందుకు ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం లింగయ్యపల్లె గ్రామంలో 20లక్షలతో నిర్మించే సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఉత్తమ గ్రామపంచాయతీలకు ప్రశంసాపత్రాలు అందజేత..
మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని 29 గ్రామపంచాయతీలకు గాను మండల స్థాయిలో 15 గ్రామపంచాయతీలకు ఉత్తమ గ్రామపంచాయతీ ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, ఎమ్మార్వో కిషన్, ఎంపీడీవో అరుణారాణి, ఎంపీపీ వైస్ ఎంపీపీలు, మాదాడి సరోజన, సుతారి వినయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజారాం రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు రియాజోద్దీన్, కోఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ ముత్యం సతీష్ వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.