ఉద్యోగుల ఎదురు చూపులు.. నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడేనా ?

by samatah |   ( Updated:2022-03-07 08:18:57.0  )
ఉద్యోగుల ఎదురు చూపులు.. నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడేనా ?
X

దిశ,లోకేశ్వరం: పదోన్నతి కోసం నాలుగేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు అధికారులు చేపట్టిన చర్యల వల్ల వారిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఏ.ఆర్ (ఆర్ముడ్ రిజర్వుడ్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీ ఎస్ ఎస్ పీ) విభాగాల నుంచి సివిల్ విభాగంలోకి వచ్చినా తమకు పదోన్నతుల విషయంలో పాత సీనియార్టీ‌ని పరిగణలోకి తీసుకోవడం లేదంటూ 2018 సంవత్సరంలో కొంతమంది కానిస్టేబుళ్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1990లో సివిల్ కానిస్టేబుళ్లు‌గా ఎంపికై 32 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 300 మంది కానిస్టేబుళ్లగానే విధులు నిర్వహిస్తూ పదోన్నతి కోసం వేచి చూస్తున్నారు. కాగా గత నెలలో అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు యూనిట్ల వారీగా కానిస్టేబుళ్ల సీనియారిటీ జాబితాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

ఐదేళ్ల నిరీక్షణకు తెరపడేనా..

గత నాలుగేళ్లుగా హెడ్ కానిస్టేబుల్ పదవుల కోసం వేచి చూస్తున్న మూడు వందల మంది కానిస్టేబుళ్లు నిరీక్షణకు ఇకనైనా తెర పడనుందని వారు ఆశిస్తున్నారు. పదోన్నతి విషయమై గత జనవరిలో దిశ దినపత్రిక లో వార్త ప్రచురితమైన వారం రోజుల్లో కోర్టు తీర్పు ఇవ్వడంతో పలువురు కానిస్టేబుల్లు దిశ దినపత్రికకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, తీవ్ర మానసిక వేదనతో విధులు నిర్వహిస్తున్న వారి ఎదురుచూపులు ఫలించి వీలైనంత త్వరలో పదోన్నతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆశిద్దాం.

Advertisement

Next Story

Most Viewed