- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికలే లక్ష్యంగా దూకుడు పెంచిన బీజేపీ
సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీసీ నాయకుడికి తిరిగి పార్టీలోకి ఆహ్వానం
దిశ, భైంసా : రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ స్పీడు పెంచింది. గతంలో పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన బీసీ నాయకుడు, మాజీ బీజేపీ భైంసా పట్టణాధ్యక్షుడు గాలి రవిని బుధవారం భాజపా పార్టీ కండువా వేసి జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి పార్టీలోకి ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ముధోల్ తాలూకాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీ నాయకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత రవిని పార్టీకి దగ్గరగా చేసుకుని పార్టీని ఇప్పటి నుంచే బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర బీజేపీ నాయకుల సూచనల మేరకు నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకండి రమాదేవి, జిల్లా సహాయ ఇంచార్జ్ మ్యాన మహేష్ సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగాధర్, మెడిసి రాజు, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్, పట్టణాధ్యక్షుడు మల్లేష్ చర్చించి సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ.. బీజేపీలో కొనసాగుతున్న కార్యకర్తలు క్రమశిక్షణగా మెలుగుతూ, పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా అడుగులు వేయాలన్నారు. పార్టీకి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారు పార్టీ క్రమశిక్షణ చర్యలకు బాధ్యలవుతారని హితవు పలికారు.