ప్రమాదాల నివారణకు కృషి చేయాలి

by Sridhar Babu |
ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
X

దిశ, గుడిహత్నూర్ : జాతీయ రహదారిపై అధికంగా ప్రమాదాలు జరుగుతున్నందున వాటి నివారణకు పోలీసులు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. గురువారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ ని ఆయన తనిఖీ చేశారు. మొదట పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి వాహనాలకు సంబంధించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ కి వచ్చే ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మండల ప్రజలకు నియమ నిబంధనలపై అవగాహన నిర్వహించాలన్నారు. సైబర్ నేరగాళ్లు అవలంబిస్తున్న నూతన విధానాలను, వారు చేస్తున్న మోసాలను వివరించాలని కోరారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉట్నూర్ డీఎస్పీ సీహెచ్. నాగేందర్, ఇచ్చోడ సీఐ భీమేష్, ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ ఉన్నారు.

Advertisement

Next Story