వెలుగు శాఖలో కమ్ముకుంటున్న చీకట్లు

by samatah |
వెలుగు శాఖలో కమ్ముకుంటున్న చీకట్లు
X

దిశ, కోటపల్లి : మండలంలో వెలుగు శాఖలో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది. నిధులను పక్కదారి పట్టించి దోచుకుంటున్నారు. ఈ దోచుకునే వారిలో గ్రామ స్థాయిలో సీఏ మొదలు కొని ఎపీఎం వరకు చేతివాటం చూపుతున్నారంటే అవినీతి ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవచ్చు . ఇలాంటి అవినీతి సంఘటన తాజాగా మండలం‌లోని అలుగామ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామంలో 36 ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లు ఉన్నాయి. అప్పటి గ్రామ సీఏ అంబాల మల్లేష్ అనే వ్యక్తి శ్రీనిధికి SHG ద్వారా రికవరీ చేయాల్సిన రెండు లక్షలకు పైగా అవెలుగు శాఖలో చీకట్లువినీతి జరిగిందనీ గ్రామ సర్పంచ్ దృష్టికి గ్రూప్ సభ్యులు తీసుకురాగా, సర్పంచ్ శ్రీనిధి మేనేజర్‌కి సంచారం ఇవ్వడంతో అతను ఎంక్వేరీ చేసి అవినీతి జరిగిన మాట వాస్తవమేనని తెలియజేశారు. ఈ అవినీతి వెనక సీఏ మొదలుకొని APM వరకు అందరూ ఉన్నారని బాధితులు వాపోతన్నారు . ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి APM , CC ఇద్దరు రాత్రికి రాత్రే గ్రూప్ అధ్యక్షుల దగ్గరకు వెళ్ళి వారితో, రాత్రి దొంగ సంతకాలు తీసుకొని అవినీతి బయట పెడితే జాబ్ పోతుందని గ్రహించి రెండు లక్షల రూపాయలను విరే కట్టినట్టు సంగం సభ్యులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా సీఏ మల్లేష్ ప్రతిసారీ అవినీతికి పాల్పడుతున్నాడని అతనిని శాశ్వతంగా గ్రామ సమాఖ్య తీర్మానం చేసి సీఏ పదవి నుండి తీసేశారు. అదే సమయంలో వేరే సభ్యులకి సీఏ బాధ్యతలు అప్పగించారని గ్రామ సమాఖ్య సభ్యులు తెలిపారు.




నా పేరు తగరం రాజయ్య మాది అలుగామ గ్రామం నేను 2014 సంవత్సరం‌లో నా భార్య తగరం బాయక్క మహిళ సంఘాలలో పర్సనల్ లోన్ కింద ఆవుల కోసం 30, 000 లోన్ తీసుకుంది. ఈ లోన్‌ను నేను విడతల వారీగా బ్యాంక్ కి కట్టాలి. అందుకోసం నేను ఒకసారి 9000 మరోసారి 3000 సీసీ‌కి కట్టాను, మిగిలిన డబ్బులు 6000, 3000 మా ఊరి అప్పటి ‌సీఏగా పనిచేస్తున్న మల్లేష్ అనే వ్యక్తికి కట్టినాను. అతను బ్యాంక్ లో కట్టిన విధంగా రసీదులు తీసుకొచ్చి ఇచ్చారు. రసీదులు చూసి కట్టినము అనుకున్నాం కానీ తీరా నువ్వు డబ్బులు కట్టాలి అని సీసీ చెప్పడంతో నా దగ్గర ఉన్న రసీదులు తీసుకెళ్ళి చూపిస్తే అవి ఫేక్ అని తేలిపోయింది. నన్ను నమ్మించడానికి ఈ సీఏ దొంగ రసీదులు ఇచ్చాడని సీసీ తెలిపారు. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

Advertisement

Next Story