కలెక్టరేట్ ని ముట్టడించిన వీఓఏలు..

by Sumithra |
కలెక్టరేట్ ని ముట్టడించిన వీఓఏలు..
X

దిశ, మంచిర్యాల టౌన్ : వీవోఏ లు ఎదుర్కుంటున్న సమస్యలు తీర్చాలని, వారీ న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని చేస్తున్న సమ్మె 17 వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు బుధవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. విఓఏ ల జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకాలు గ్రామల్లో మహిళలకు తెలియజేస్తూ వడ్డీ లేని రుణాలుతో పాటు ప్రభుత్వ పథకాలు గ్రామాల్లో తెలియజేయడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న తమకు కనీస జీతాలు ఇవ్వక పోగా, ప్రభుత్వం వివోఏ లతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

3900 రూపాయలు ఉన్న విఓఏల జీతాన్ని 26,000 వేలకు పెంచాలి అంటూ, జీఓ నంబర్ 58 ను వెంట నే రద్దు చేయాలి అని, మృతి చెందిన వివోఏ ల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున 20 లక్షల ఎక్స్ గ్రేశియ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. వివోఏ లకు చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిల్ల శారద మద్దతుగా నిలిచిచారు. వివోఏ ల న్యాయమైన డిమాండ్ లను ప్రబుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దీక్షలో మంచిర్యాల జిల్లాలోని అన్ని మండల, గ్రామాల వివోఏలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed