తాగునీరు కోసం కన్గుట్ట గ్రామస్థుల ఆందోళన

by Shiva |   ( Updated:2023-04-22 13:59:47.0  )
తాగునీరు కోసం కన్గుట్ట గ్రామస్థుల ఆందోళన
X

దిశ, బోథ్: మండల పరిధిలోని కన్గుట్ట గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని అధికారులకు తెలియజేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో చేతిపంపులు ఉన్నా.. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో తక్షణమే అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలియజేశారు.

Advertisement

Next Story